కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య పరిపాహిమాం పరవాసుదేవ
జనరంజని - చతురశ్ర త్రిపుట
పల్లవి:
పరిపాహిమాం పరవాసుదేవ
కరుణాలవాలాశ్రిత మందార॥
అనుపల్లవి:
కరిరాజ సన్నుత సచ్చరిత్ర
ధరణీసుతావర శ్రీకర॥
చరణము(లు):
వనజాసనాది సురవందిత
సనకాదియోగి జనార్చిత॥
ఇనవంశసుధాంబుధి పూర్ణచంద్ర
ఘనసన్నిభాంగ శ్రీరామచంద్ర॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - paripAhimAM paravAsudEva - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )