కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య మమ హృదయే విహరదయాళో కృష్ణ
రీతిగౌళ - ఖండ త్రిపుట
పల్లవి:
మమ హృదయే విహరదయాళో కృష్ణ
మందరధర గోవింద ముకుంద॥
అనుపల్లవి:
మంథదామ సువిరాజిత శ్రీకృష్ణ
మందహాస వదనారవిందనయన॥
చరణము(లు):
యదుకులవారిధి పూర్ణచంద్ర
విదురవందితపాద గుణసాంద్ర॥
మదనజనక శ్రీకర మహానుభావ
సదయహృదయ శ్రీవాసుదేవ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - mama hR^idayE viharadayALO kR^iShNa - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )