కీర్తనలు మైసూర్‌ వాసుదేవాచార్య రామాభిరామ - మామవ శ్రీరామ॥
మధ్యమావతి - త్ర్యశ్ర త్రిపుట
పల్లవి:
రామాభిరామ - మామవ శ్రీరామ॥
అనుపల్లవి:
రామ రవికులలలామ - రాక్షసకులభీమ
రామచంద్ర సుగుణసాంద్ర - శ్రీమానసాంబుధిచంద్ర॥
చరణము(లు):
పవనాత్మజ సంపూజిత - పరమాద్భుత నిజచరిత
దేవాదిదేవ మాధవ - శ్రీవాసుదేవ
సార్వభౌమ సత్యకామ - సర్వలోకవంద్య రామ॥
AndhraBharati AMdhra bhArati - maisUr vAsudEvAchArya kIrtanalu - rAmAbhirAma - mAmava shrIrAma\.. - Mysore Vasudevacharya - Mysore Vasudevachar ( telugu andhra )