శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
మ. నినునెవ్వాఁడు దలంచు నీమహిమ వర్ణింపంగ నెవ్వాఁడు నే
ర్పునఁబూను\న్‌ నినుగొల్చునట్టిఘనుఁ డాపుణ్యాత్ములోకైకమా
న్యునిఁగా ధన్యునిఁగా వివేకనిధిఁగా నుద్యద్గుణాంభోధిఁగా
ననిశంబుం గొనియాడఁ గోరుదురు కృష్ణా దేవకీనందనా.
21
శా. శీలంబు\న్‌ గులము\న్‌ వివేకనిధి లక్ష్మీకాంతవక్షస్స్థలి\న్‌
హాళింబాయకయుండు కాముకుఁడవై హంకారవృత్తి\న్‌ సదా
స్త్రీలోలుండన రాధతోఁ బెనఁగుట ల్చిత్రంబులు న్నౌర నీ
జాలం బే మని సన్నుతించెదను కృష్ణా దేవకీనందనా.
22
శా. శ్రీలక్ష్మీధవ రుక్మిణిం గలసి కూర్మి\న్‌ మిత్రవందా సుదం
తాలోలాక్షులఁ గూడి జాంబవతి సత్యాలక్ష్మణాభద్రల\న్‌
కాళింది\న్‌ మరుకేళిఁ దేల్చితివి శృంగారాంగగోపాంగనా
జాలంబు\న్‌ దనియింతు నౌర తుదఁ గృష్ణా దేవకీనందనా.
23
శా. మద్దు ల్గూల్చినలాగొ వేగ మనిలో మన్నించి గాండీవికి\న్‌
బుద్దుల్‌ సెప్పినలాగొ మోదరసముప్పొంగ\న్‌ యశోదమ్మకు\న్‌
ముద్దుల్గా నటియించులాగొ వరుస\న్‌ మువ్వేళల\న్‌ వేడుక\న్‌
చద్దు ల్మెక్కి రహించులాగొ ధరఁ గృష్ణా దేవకీనందనా.
24
మ. చరణాబ్జంబులు వీడ్వడ\న్‌ నిలచి యోజ\న్‌ దట్టిలో పిల్లఁగ్రోల్‌
కర మొప్పారఁగ నుంచి యింపొందవఁ జంక\న్‌ గోలనందిచ్చి బ
ల్వురుగోపాలురు జుట్టునుంగొలువ వేల్పుల్‌ గ్రుక్కిళుల్మ్రింగఁగా
నరయం జల్ది భుజింపవే యడవిఁ గృష్ణా దేవకీనందనా.
25
మ. మెఱుఁగుల్దేఱు మహేంద్రనీలనిభమౌ మేన\న్‌ సమీపాటగో
ఖుర నిర్ధూత ధరాపరాగలవ పంక్తుల్గప్పఁగా నొక్కచేఁ
బురిగోలొక్కటఁ బాలకుండఁ గొనుచుం బొల్పొంగ గోధుగ్జనాం
తర వర్ధిష్ణుఁడవైన ని\న్‌ గొలుతుఁ గృష్ణా దేవకీనందనా.
26
శా. అధివ్యాధిహరంబు జన్మమరణవ్యాపారదుష్కర్మ దు
ర్బోధావ్యాప్తినివారణంబు సతతస్ఫూర్జ జ్జగద్రక్షణో
న్మేధాయుక్తము భక్తవాంఛితఫలానీకప్రధానైక దీ
క్షాధౌరేయము నీమహామహిమ కృష్ణా దేవకీనందనా.
27
శా. హాలాహాలశిరోధిమౌళి నయనోద్యద్భీమ ధూమధ్వజ
జ్వాలాభీలకరాళరూక్ష విషనిశ్వాసోష్ణకృష్ణానదాం
భోలీలాస్పద కాళియస్ఫుటనటద్భోగాగ్ర మధ్యంబున\న్‌
హాళి\న్‌ దాండవమాడు ని\న్‌ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా.
28
మ. తినదేచెట్టున నాకు మేఁక గుహ గొందిం బాము నిద్రింపదే
వనవాసంబునఁ బక్షులు\న్‌ మృగములు\న్‌ వర్తింపవే నీటిలో
మునుకల్‌ వేయవె మత్స్యకచ్ఛపములు న్మోక్షార్థమౌ ముక్తికి\న్‌
మనసే మూలము నీదుభక్తులకు కృష్ణా దేవకీనందనా.
29
శా. వింటిం గొంతగ మీమహత్వమును నుర్వి\న్‌ దర్శనప్రాప్తిచే
ఘంటాకర్ణుని నుగ్రసేనతనయుం గైవల్యతేజంబు ని
న్నంటంజేయవె మాటమాత్రమున నిట్లాశ్చర్యము\న్‌ బొందఁగా
నంటం బొందనివేల్పు ని\న్‌ గొలుతుఁ గృష్ణా దేవకీనందనా.
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )