శతకములు దేవకీనందన శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
మ. ఉర్విం బాఱుమహానదీజలము లాయూరూరునందెల్లఁ గూ
డురుఘోషంబున వంకలై కలియఁగా యోగ్యంబు లైనట్లు మీ
స్మరణ\న్‌ నానుడువు\న్‌ సదాశుభములై సంపూజ్యము\న్‌ గా భవ
చ్చరణంబుల్‌ మది నిల్పి కొల్చెదను కృష్ణా దేవకీనందనా.
81
శా. బాలక్రీడలఁ గొన్నినాళ్లు పిదప\న్‌ భామాకుచాలింగనా
లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్లు మఱియిల్లు\న్‌ ముంగిలింగొన్ని నా
ళ్లీలీల\న్‌ విహరించితి\న్‌ సుఖఫలం బెందేనియు\న్‌ లేదుగా
చాల\న్‌ నీపదభక్తిఁ జేసెదను కృష్ణా దేవకీనందనా.
82
మ. మతిలో మిమ్ముఁదలంచు పుణ్యుఁడిలఁ దామాయ\న్‌ స్వదారాదుల
న్వెతలం బొర్లఁడు భాగ్యవంతుఁడగుఠీవి\న్‌ దివ్యమృష్టాన్న సం
గతిలోనాడి మనుండు భిక్షమునొసంగ\న్‌ నేర్చునే శూలభృ
చ్చతురాస్య ప్రముఖామర ప్రణుత కృష్ణా దేవకీనందనా.
83
శా. అన్నంబైనను దక్రమైనఁ దగుతోయంబైన నభ్యాగతుల్‌
దన్నాశించిన నేమియు న్నిడక యేధర్మంబునుం జేయ కే
మన్న న్నూరకయుండు జీవశరమర్త్యశ్రేణి జేయ కే
చన్న న్నేమగు నేమగు\న్‌ గలుగఁ గృష్ణా దేవకీనందనా.
84
శా. ప్రారబ్ధానుభవంబు దీఱ కపవర్గప్రాప్తి లేదండ్రుగా
దీరశ్రేష్ఠు లనంతకోటులిఁక నైతే వారికర్మంబులు\న్‌
ప్రారబ్ధంబులు గావె ముందఱకు నోభావజ్ఞ సైరించి నా
ప్రారబ్ధంబులఁ దీర్పవే కరుణఁ గృష్ణా దేవకీనందనా.
85
శా. శ్రీజన్మప్రభుతావిశేషుఁ డగు రాజేంద్రుండు ధీపాలనా
జ్ఞాజాగ్రత్వనిదానకీర్తియుత రక్షాలక్షణాధీశుఁడై
రాజిల్లుం బహుకష్టుఁడైన ధరసామ్రాజ్యంబు బాలింపుచో
నైజంబై తగునా విశేషములు కృష్ణా దేవకీనందనా.
86
మ. సమరద్వేషుల సంగరాంగణమున\న్‌ సాధించి సామ్రాజ్య సౌ
ఖ్యముఁ దాఁగాంచి సహించి చొప్పడు వివేకప్రాజ్ఞతల్గాంచు భూ
రమణశ్రేష్ఠుఁడు తావకానుచరుఁడై రాణించు శిక్షించు దు
ష్టమతి భ్రష్టమదాంధ శత్రువుల కృష్ణా దేవకీనందనా.
87
మ. విగతక్లేశులు వీతకిల్బిషమయుల్‌ విజ్ఞానవిద్యానిధుల్‌
నిగమార్థజ్ఞులు నిశ్చలవ్రతయుతుల్‌ నిర్వ్యాజనిష్ఠాయుతుల్‌
సుగుణుల్‌ సూనృతవర్తనుల్‌ శుభకరుల్‌ శుద్ధాంతరంగుల్‌ శుభుల్‌
జగతీమండలి నీదుసేవకులు కృష్ణా దేవకీనందనా.
88
శా. దీనుల్గల్గిన నీదు రక్షణగుణాధిక్యంబు రాణించు నౌ
దీనుండెవ్వఁడు లేఁడు నీదుకరుణాదృష్టి\న్‌ గృతార్థుల్‌ జుమీ
నేనే దీనుఁడ నన్నుఁ బ్రోవు శరణంటిం ద్వన్ముఖోదీర్ణ సు
జ్ఞాన శ్రీకరమూర్తి నమ్మితిని కృష్ణా దేవకీనందనా.
89
శా. పాత్రాపాత్రవివేకము ల్సమసె పాపం బెచ్చె ధర్మంబును\న్‌
మిత్రఘ్నత్వము కల్లలాడుటయు స్వామిద్రోహముం గొండెము\న్‌
ధాత్రిం బూజ్యము లయ్యె సజ్జనులచందం బెట్లు రక్షించెదో
సత్రాజిత్తనయా మనోరమణ కృష్ణా దేవకీనందనా.
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - dEvakInaMdana shatakamu - vennelakaMTi jannayya kavi ( telugu andhra )