శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. తపముల్‌ మంత్రసమస్తయజ్ఞఫలముల్‌ దానక్రియారంభముల్‌
జపముల్‌ పుణ్యసుతీర్థసేవఫలముల్‌ సద్వేదవిజ్ఞానము\న్‌
ఉపవాసవ్రతశీలకర్మఫలముల్‌ ఒప్పార నిన్నాత్మలో
నుపమింపం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా!
101
శా. శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడు\న్‌
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా!
102
మ. కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్యసంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబున\న్‌
అలర న్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహంబు దా
వెలయ\న్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా!
103
మ. రమణీయంబుగ నాదిమంబు నవతారంబు\న్‌ భవద్దివ్యరూ
పము నామామృతము\న్‌ దలంప దశకప్రా ప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షము\న్‌ ద్వివిధసంప్రాప్తి\న్‌ శతాంధ్రాఖ్య కా
వ్యము నర్పించితి మీపదాబ్జములకు\న్‌ వైకుంఠ నారాయణా!
104
శా. నీమూర్తుల్‌ గన నీకథల్‌ వినఁ దుది\న్‌ నీ పాద నిర్మాల్యని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్‌
నీమం బొప్ప భజింప నీజపము వర్ణింప\న్‌ గృపం జేయవే
శ్రీ మించ\న్‌ బహుజన్మ జన్మములకు\న్‌ శ్రీయాదినారాయణా!
105
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )