శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. మగమీనాకృతి వార్ధిఁ జొచ్చి యసురు న్మర్దించి యవ్వేదముల్‌
మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ
బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్‌
ఖగరాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య, నారాయణా!
11
మ. అమరుల్‌ రాక్షసనాయకుల్‌ కడఁకతో నత్యంతసామర్థ్యులై
భ్రమరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా
దమకించె\న్‌ భువనత్రయంబును గిరుల్‌ దంతావళుల్‌ మ్రొగ్గినం
గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ, నారాయణా!
12
శా. భీమాకారవరాహమై భువనముల్‌ భీతిల్లి కంపింప ను
ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్‌
హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మి\న్‌ గారవింపంగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా!
13
శా. స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్‌
దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరు\న్‌
శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్‌ శోభిల్ల మన్నించి య
జ్జంభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు, నారాయణా!
14
మ. మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా
గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో
విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్‌
సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర, నారాయణా!
15
మ. ధరణిన్‌ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
పరగం బైతృక తర్పణంబుకొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్‌
నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జించి త
త్పరశుభ్రాజిత రామనామము కడు\న్‌ ధన్యంబు, నారాయణా!
16
మ. వరుసం దాటకిఁ జంపి కైశికు మఘ స్వాస్థ్యంబు గావించి శం
కరు చాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రిపం
పరుదారన్‌ వనభూమి కేఁగి జగదాహ్లాదంబుగా రావణున్‌
ధరణిం గూల్చిన రామనామము కడు\న్‌ ధన్యంబు, నారాయణా!
17
మ. యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్‌
మదవద్ధేనుక ముష్టికా ద్యసురుల\న్‌ మర్దించి లీలారసా
స్పద కేళీరతి రేవతీవదన కంజాతాంతభృంగం బన\న్‌
విదితంబౌ బలరామమూర్తివని నిన్‌ వీక్షింతు, నారాయణా!
18
మ. పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద
త్పురనారీ మహిమోన్నతుల్‌ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో
వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రబోధించి య
ప్పురముల్‌ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు, నారాయణా!
19
మ. కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై
కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ
వలనం గల్క్యవతార మొందఁగల నిన్‌ వర్ణింతు నారాయణా!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )