శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
మ. ఎల రారన్‌ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ
బొలుపారం దగిలుండునేని యఘముల్‌ పొందంగ నె ట్లోపెడు\న్‌
కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్‌
నిలువ న్నేర్చునే భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా!
31
మ. కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్‌
వెలయ\న్‌ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబున\న్‌
జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్‌
దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠన\న్‌ దోషఘ్న, నారాయణా!
32
మ. కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై
నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో
నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయు\న్‌
వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా!
33
మ. పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై
సురసిద్ధోరగయక్ష పక్షిమునిరక్షో హృద్గుహాభ్యంతర
స్థిరసుజ్ఞానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై
సరి లే కెప్పుడు నీదునామ మమరున్‌ సత్యంబు, నారాయణా!
34
మ. అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్‌
సుధయై వేదవినూత్నరత్నములకున్‌ సూత్రాభిధానంబునై
బుధసందోహమనోహరాంకురమునై భూదేవతాకోటికిన్‌
విధులై మీబహునామరాజి వెలయున్‌ వేదాత్మ, నారాయణా!
35
మ. పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం
దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దును\న్‌
ఘనపాపంబుల వైరి షడ్రిపులకు\న్‌ గాలావసానంబు మీ
వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా!
36
మ. భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబింబంబు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
భువిలో మీదగు మంత్రరాజ మమరున్‌ భూతాత్మ, నారాయణా!
37
మ. వరుసన్‌ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ
బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం
బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండు మీ
తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా!
38
మ. హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్‌ ధ్రువుం
గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్‌ ఘంటాశ్రవు న్నారదు\న్‌
గర మొప్ప న్విదురున్‌ బరాశరసుతున్‌ గాంగేయుని\న్‌ ద్రౌపదిన్‌
నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా!
39
శా. శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా
భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులు\న్‌,
లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియు\న్‌ గల్గు నా
లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )