శతకములు నారాయణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
శా. ఏభావంబున ని\న్‌ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నా కిమ్ము నారాయణా!
91
శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబున\న్‌
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్‌
నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్‌ నీప్రాపు సేవించినన్‌
నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా!
92
మ. నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్‌ వీనుల\న్‌
విని మోదింపనివాఁడు చెవ్డు మరి ని\న్‌ వేడ్క\న్‌ మనోవీథిని\న్‌
గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై
తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా!
93
మ. నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్‌ సేవించుచందంబు తా
నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్‌ పూని వే
ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా!
94
మ. నిను వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా
నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా
నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా!
95
శా. నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ
నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ
నీవే శంకరమూలమంత్ర మరయన్‌ నీవే జగత్కర్తవున్‌
నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా!
96
మ. అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతము\న్‌
విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికి\న్‌
గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ
కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా!
97
శా. చెల్లం జేసితి పాతకంబులు మది\న్‌ శ్రీనాథ మీనామముల్‌
పొల్లుల్‌ బోవని నమ్మి పద్యశతమున్‌ బూర్ణంబుగాఁ జెప్పితిన్‌
చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిం దండ్రియు నీవు గాక యొరులే తర్కింప నారాయణా!
98
మ. నరసిం హాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ
ధర గోవింద ముకుంద కేశవ జగత్త్రా తాహితల్పాంబుజో
దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం
దిర పీతాంబర భక్తవత్సల కృపన్‌ దీవింపు నారాయణా!
99
మ. కడకంటం గడలేని సంపద లొగిం గావింపు లక్ష్మీశ పా
ల్కడలిన్‌ బన్నగశాయివై భువనముల్‌ గల్పించు సత్పుత్రుని\న్‌
బొడమ\న్‌ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
పడతిం గన్న పదారవిందముల నే భావింతు నారాయణా!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - nArAyaNa shatakamu - bammera pOtana ( telugu andhra )