శతకములు | సంపఁగిమన్న శతకము |
|
క. |
ముందు వెనుకెఱుఁగ కాటల సందడిఁ బడి మోక్షసుఖము సాధింపనియా పందలవ్రతుకులు నిఁక నే చందంబో యెఱుఁగ మన్న! సంపఁగిమన్నా! |
101 |
క. |
వెలిచూపును లోచూపును గలయంగా నొక్కచూపుఁగా జూచిన యా నిలుకడ గలయోగీంద్రుఁడె సలలితసుజ్ఞాని యన్న!సంపఁగిమన్నా! |
102 |
క. |
చిత్తమునం దమ్మెఱుఁగక తెత్తురు తమచేటు నత్త తిత్తు న్మత్తున్ మొత్తముగ నూడిపోయిన సత్తులవా? సుప్రసన్న!సంపఁగిమన్నా! |
103 |
క. |
సంపద లెఱుఁగక తామే సంపదగలవార మనుచు జడు లిలఁ దమలో సంపదఁ గననేరక వెలి సంపదలే చూతు రన్న! సంపఁగిమన్నా! |
104 |
క. |
నేరనిజనులను బట్టుక పోరాడఁగ నేల పల్కపోతారాటం బేరీతిఁ దెల్ప గతికి వి చారము మదిఁ బుట్టదన్న! సంపఁగిమన్నా! |
105 |
క. |
శోధింపరు తత్త్వజ్ఞులు నీధరఁ దమతోడిసరికి నీదుర్మనుజుల్ మేధావంతులు పెద్దలు సాధువు లని యెంతు రన్న! సంపఁగిమన్నా! |
106 |
క. |
పుత్రులు మిత్రులు బంధుక ళత్రములనువారు ముక్తిలలనకు నరునిన్ బాత్రుని గానీయరు హిత శత్రులుగా వార లెన్న! సంపఁగిమన్నా! |
107 |
క. |
సంకల్ప ముడిఁగి తా ని స్సంకల్పుం డైనఁ జాలు సద్గతి తడవా సంకల్పమె బంధము ని స్సంకల్పమె మోక్ష మెన్న సంపఁగిమన్నా! |
108 |
క. |
జనుఁడుం జిదమృతరసవార్ థిని చెట్టునఁ గ్రీడ సల్పి తెప్పలఁ దేలున్ విను తుచ్ఛసుఖము లేలా సనకాది మునిప్రసన్న! సంపఁగిమన్నా! |
109 |
క. |
కీలెఱిఁగి జీవపదముల నోలిన్ సమరసము చేసి యోగానందుల్ బాలోన్మత్తపిశాచుల చాలుగ వర్తింతు రన్న! సంపఁగిమన్నా! |
110 |