శతకములు | సంపఁగిమన్న శతకము |
|
క. |
సాధింపఁగ నిరతులకున్ బోధింపఁగ నేర్పు గల్గుపుణ్యాత్ముల యా యీధరఁ గల రొకకొందఱు సాధారణవిబుధు లెన్న సంపఁగిమన్నా! |
31 |
క. |
అనుభవము లేనిగురుచే వినునతనికి సంశయంబు వీడునె చిత్రా ర్కునివలనఁ దమము వాయునె సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! |
32 |
క. |
బరువఁట యెవరికి గురువో హరిహరి తనుఁ దెలియలేనియాతఁడు గురువా? గురువనఁగా సిగ్గుగదే శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా! |
33 |
క. |
నేరనిగురుబోధలు సం సారము లై కూనలమ్మసంకీర్తన లై దూరము లై ముక్తికి ని స్సారములై పోవు నన్న! సంపఁగిమన్నా! |
34 |
క. |
బూటకపుయోగి నెఱుఁగక పాటింతురు డబ్బుఁ జూచి పస లేకున్న\న్ దాటో టని జగ మెల్లను జాటింతురు లోకు లెన్న సంపఁగిమన్నా! |
35 |
క. |
కల్ల యగుజ్ఞాన మేలా చెల్లనికా సెచట నైనఁ జెల్లనికాసే తెల్లమిగఁ దెలుపునాతఁడు సల్లలితజ్ఞాని యెన్న సంపఁగిమన్నా! |
36 |
క. |
గాడిదవలె బూడిదఁ బొ ర్లాడుచుఁ గొక్కెరయుఁ బోలె ధ్యానము సే సే బేడిదపుఁ గపటయోగుల జాడలు ఘను లెంచరన్న సంపఁగిమన్నా! |
37 |
క. |
కీడొసఁగెడు గురు డేలా గాడిదవాలంబుఁ బట్టి ఘననదు లీఁద\న్ గూడునె గుండెలు పగులఁగ జాడింపదె ఱొమ్ముఁ దన్ని సంపఁగిమన్నా! |
38 |
క. |
అంగం బెఱుఁగరు ముక్తి తె ఱంగెఱుఁగరు కపటధూర్తరావణవేషుల్ దొంగలగురువులవారల సంగతి దుర్బోధ లెన్న సంపఁగిమన్నా! |
39 |
క. |
చేతోగతిఁ దము నెఱిఁగిన యాతద్‌జ్ఞులు భువిని జనుల నందఱ సరిగాఁ జూతురు సమరసభావనఁ జాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా! |
40 |