శతకములు | సంపఁగిమన్న శతకము |
|
క. |
వచ్చినవాసనవెంబడి విచ్చలవిడి యోగివరుఁడు విహరించినవాఁ డెచ్చట నేక్రియఁ జేసిన సచ్చిన్మయు నంట దన్న సంపఁగిమన్నా! |
41 |
క. |
విత్తమదమత్తు లాయత చిత్తభ్రమ లెఱుఁగలేరు చిత్పురుషుని దా నుత్తముఁడితఁడని సన్ముని సత్తముఁడై యెఱుఁగు నన్న! సంపఁగిమన్నా! |
42 |
క. |
తనవాసనయెట్లుండిన ఘనయోగికి బంధవృత్తి గానేరదు వాఁ డనుభవముకతన నిర్వా సనుఁ డై మరి పుట్టఁ డన్న సంపఁగిమన్నా! |
43 |
క. |
క్రమమున సుఖదుఃఖంబులు కమలిన నుతినింద లాదిగాఁ గలయవియా యమివర్యుఁ డన్నిక్రియలం సముఁడై వర్తించు నన్న సంపఁగిమన్నా! |
44 |
క. |
తలకొని దుఃఖము రానీ వలనొప్పఁగ నిత్యసుఖము వచ్చిన రానీ నలఁకువను బడనిమనుజుఁడు చలియింపఁడు బోధ గన్న సంపఁగిమన్నా! |
45 |
క. |
చాలా లోకులు నగనీ వాలాయము కీడు మేలు వచ్చిన రానీ యేలా గైనను బురుషుఁడు జాలిం బడఁ డాత్మఁ గన్న సంపఁగిమన్నా! |
46 |
క. |
బాలుఁడుగానీ భోగ స్త్రీలోలుఁడుగాని విషయశీలుఁడు గానీ మేలైనబోధ గలిగినఁ జాలదె ముక్తిని గనంగ సంపఁగిమన్నా! |
47 |
క. |
విత్తపరాయణుఁ డయినన్ మత్తచకోరాక్షులందు మగ్నుండైన\న్ సూత్తమపురుషుఁడె గాదా సత్తామాత్రంబు గనును సంపఁగిమన్నా! |
48 |
క. |
పంచావస్థలఁ దగిలియుఁ బంచావస్థలను గడచు ప్రాజ్ఞుండు జగ ద్వంచకుఁ డై లోకులవలె సంచారము సేయు నన్న సంపఁగిమన్నా! |
49 |
క. |
పిప్పలర నాత్మసుఖముల తెప్పం దేలేటియోగిఁ దెలియక తమలో నప్పురుషుం గని కర్ములు చప్పనఁగాఁ జూతు రన్న సంపఁగిమన్నా! |
50 |