శతకములు | సంపఁగిమన్న శతకము |
|
క. |
మునిఁగితి మందురు మునుఁగుట మనసో పంచేంద్రియములో మఱి జీవుండో మునుఁగుట యెవరో తెలియదు సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! |
71 |
క. |
తానైనం బరిశుద్ధుఁడు మేనైన న్మట్టి బొంకి మేనో తానో పూనికఁ జేసెడితీర్థ స్నానం బిఁక నెవరి కన్న సంపఁగిమన్నా! |
72 |
క. |
సూతకము వచ్చె ననుచును నాతలఁ బదినాళ్లు జరపినంతనె తెగునా? సూతకమే కాదా తన జాతకము నెఱింగికొన్న సంపఁగిమన్నా! |
73 |
క. |
ముట్టున దొలఁగుదురేమో ముట్టుననే తనువుగాఁక మునుఁగుదు రేమో ముట్టుకు వెలియైతే యొక చట్టా మఱిదేహ మెల్ల సంపఁగిమన్నా! |
74 |
క. |
కలలో నొక్కఁడు పులిఁ గని పులిచే నణఁగుటను దాను పులియుటబొంకా కలవలెను జగమెల్లను సలలితభక్తిప్రసన్న! సంపఁగిమన్నా! |
75 |
క. |
భ్రమదృశ్యజాల మెల్లను భ్రమ లోకములెల్ల మిగుల భ్రమ కర్మంబున్ భ్రమమూలమె యీసర్వము సమరసమౌ దత్త్వ మెన్న సంపఁగిమన్నా! |
76 |
క. |
వంశము తన కెక్కడిది చి దంశము లౌఁ గాకయున్నఁ గద జీవులకున్ సంశుద్ధి దొరకనేరదు సంశయములు విడువకున్న సంపఁగిమన్నా! |
77 |
క. |
తనమనసే తా నాయెను తనమనసే తన్నుఁ దెలియ దత్త్వం బయ్యెన్ మనసునకు సాక్షి మనసే సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! |
78 |
క. |
మనసే జీవుం డనగను మనసే తనచేష్ట లుడిగి మఱితత్త్వమగున్ మనసుగలవాఁడె ముక్తుఁడు సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! |
79 |
క. |
పురుషునకుఁ బ్రకృతి వేఱా సరిసమ మని తెలిసియుంట సహజము గాదా పురుషవివర్తమె ప్రకృతియు శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా! |
80 |