శతకములు | సంపఁగిమన్న శతకము |
|
క. |
నలుగురు నడచెడుత్రోవను బలిమిని లోకంబు నడచుఁ బ్రాజ్ఞుం డైనన్ నలువు రెఱుంగనిత్రోవలఁ జలియింపక నడచు నన్న! సంపఁగిమన్నా! |
91 |
క. |
మనసెక్కడ మాయెక్కడ? తనువెక్కడ? ముప్పదాఱుతత్త్వము లెచటన్ ఘనరాజయోగ మెఱిఁగిన జనునకు దాసప్రసన్న! సంపఁగిమన్నా! |
92 |
క. |
వెలిచూపును లోచూపును వెలిగాఁ దన్మధ్యమునను వెలిఁగెడితత్త్వం బలవడఁ జూచినయతఁడే సలలితుఁ డగుముక్తుఁ డన్న! సంపఁగిమన్నా! |
93 |
క. |
ఇద్దఱు నొకటైనను గడ మిద్దఱుఁ దా మేకమగుచు నేకాంతముగా నిద్దఱు నిద్దఱు నొకటై సద్దేమియు సేయ రన్న! సంపఁగిమన్నా! |
94 |
క. |
మిక్కిలి సంసారయినను నెక్కడియోగము రుచించు నెక్కుడుశైత్యం బెక్కిననోటికిఁ జేఁదగు జక్కెరపొడిఁ దిన్న నెన్న సంపఁగిమన్నా! |
95 |
క. |
నాలుగుత్రోవలనడుమను శ్రీలీలను వ్రేలుచున్న చిహ్నంబులఁ దా నాలోచించినబుద్ధివి శాలుండౌ ముక్తుఁడన్న! సంపఁగిమన్నా! |
96 |
క. |
పందలగుచెనటిమనుజుల కందంబుగ రాజయోగ మలవడు నేలా పందలకును గాడిదలకుఁ జందనగుణ మేటికన్న! సంపఁగిమన్నా! |
97 |
క. |
ఇప్పదవు లందనేరని మొప్పెలకుం దెలుప వశమె ముందఱగానే తప్పులు పట్టుచు మఱి చేఁ జప్ప ట్లిడి నగుదురన్న! సంపఁగిమన్నా! |
98 |
క. |
కను జెదర మనసుఁ జెదరం గను జెదరు న్సుఖము చెదరుఁ గాలియుఁ జెదరున్ గనుఁ జెదరక తనుఁ గనవలె సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! |
99 |
క. |
పాళ్ళును బంపును దొడవులు నూళ్ళును మును చన్నవారు నూర్జితులై రా యో ళ్ళరిగి రోళ్ళ వెంటనె సాళ్ళని ఘను లెన్న రన్న! సంపఁగిమన్నా! |
100 |