శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
ఉ. నాఁడలమేలుమంగ జననంబుకై కలశాబ్ధిఁద్రచ్చియీ
మూఁడుజగంబులందును బ్రమోదము నించితి వట్ల నుండుచో
నాఁడుఁదనంపుబృంద ముదయంబును బొందఁగ నిత్యసంపదల్‌
నేఁ డిఁక నేమిటం గడమ నీకృప వారికి వేంకటేశ్వరా!
81
ఉ. ఈతరుణీమణీ విభునియిచ్చకుఁ జాలుతలంప నీయనా
యీతని మోహినీగజము యీవని కాయలమేలుమంగ నేఁ
డీతనువల్లి చక్కఁదనము ... ... ... ... చెలువంబు చాలదా
యీ తెలిమిం చటంచు నుతియింతురు నీసతి వేంకటేశ్వరా!
82
చ. మణుల వెలుంగు దీపవనమాలికలై పొగడొందఁ గంకణ
క్వణనము మేఖలావళులఘంటలు శ్రీయలమేలుమంగకు\న్‌
బ్రణయవినోద సంపదకుఁ బాయక నీ కొనరించుపూజకై
ప్రణుతనుతప్రభావముల భాగ్యము లైనవి వేంకటేశ్వరా!
83
చ. కదిసిన సేసము తైముల కంఠసరుల్‌ ఘనరత్న కంకణాం
గదరశనా ... ... నికాయము శ్రీయలమేలుమంగకు\న్‌
బొదివి వివాహవేళ దిగఁ బోసిన ముత్తెపుఁ బ్రాల నందమై
ముదమగు నీకుఁ గన్నుఁగవ ముందఱ నెప్పుడు వేంకటేశ్వరా!
84
చ. నిగిడి పయోధిఁ ద్రచ్చు నెడ నిర్జరసంఘము నిక్కి చూడఁగా
ధగధగ యంచు దిక్కుల నుదగ్రతటిల్లత లుల్లసిల్లఁగాఁ
దగ నుదయించి మించిన సుధాప్రతి మీయలమేలుమంగ నీ
మగువ యటంచు మెత్తురు సమస్తమునీంద్రులు వేంకటేశ్వరా!
85
చ. నడవకుమమ్మ పాదనలినంబులు గందెడి, మాట బెట్టుగా
నొడువకుమమ్మ, చెక్కునును నొక్కులతో నలమేలుమంగ నీ
వెడనగ కీమొగంబునకు వెన్నెలలాయె నటంచు నీసతి\న్‌
బడఁతులు మేలమాడుదురు పల్కుల తేనెల వేంకటేశ్వరా!
86
ఉ. బూతలబండ్లనే వలపుఁబుక్కిట నించితి వాఁడిగోళ్లనే
ఘాతలు గాఁగఁ జించితివి కాయముపై నలమేలుమంగ నీ
చేతిదె యంచు నీతరుణి చెంతలఁ దట్టపునుంగుఁ గస్తురి\న్‌
జాతుదు రోలి నీదు పరిచారిక కాంతలు వేంకటేశ్వరా!
87
ఉ. పచ్చల సందిదండలును బాహుపురుల్‌ మణినూపురంబులు\న్‌
మచ్చరికంబులుం బసిఁడిమట్టెలమ్రోతలుఁ బెల్లు మ్రోయఁగా
నెచ్చెలు లోలిఁ గొల్వఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నీ
ముచ్చట దీర్చు నొక్కపరి ముందఱ నిల్చిన వేంకటేశ్వరా!
88
ఉ. ఏచిన పాతకంబులకు నిన్నిటికి న్నిరవైనవాఁడ నేఁ
గాచినకష్టవృత్తి కరిగాఁపనె యోయలమేలుమంగ నీ
చూచుకృపానిరీక్షణమె చూచెద నంచును నీప్రియాంగన\న్‌
బూచిన వాక్ప్రసూనములఁ బూజలు సేసెద వేంకటేశ్వరా!
89
ఉ. యోగ్యతలేనికష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటఁ జూడ గర్భని
ర్భాగ్యుఁడ నీకృపామతికిఁ బ్రాప్తుఁడ నోయలమేలుమంగ నా
భాగ్యము నీగృపాకరుణఁ బ్రాప్యము కావుమటంచు సారెనీ
భాగ్యవతీ శిరోమణినిఁ బ్రస్తుతిసేసెద వేంకటేశ్వరా!
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )