ఇతిహాసములు భాగవతము ద్వాదశ స్కంధము
వ. అంత హరి యతని తపంబునకుం బ్రసన్నుం డై యావిర్భవించినం గనుంగొని, దేవా! నీ
దివ్యనామ స్మరణంబునంజేసి యీ శరీరంబుతోడన యనేకయుగంబులు బ్రతుకునట్లుగాఁ
జేయవే. అనినం, గరుణించి యిచ్చుటయును.
34
తే. జగము రక్షింప జీవులఁ జంప మనుపఁ
గర్త వయి సర్వమయుఁడ వై కానిపింతు
వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు
విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప!
35
మ. బలభిన్ముఖ్య దిశాధినాథ వరులు\న్‌ ఫాలాక్ష బ్రహ్మాదులు\న్‌
జలజాతాక్ష పురందరాది సురులు\న్‌ జర్చించి నీ మాయల\న్‌
దెలియ\న్‌ లేరఁట నా వశంబె తెలియ\న్‌ దీనార్తి నిర్మూల! యు
జ్జ్వల తేజోవిభ వాతిసన్నుత! గదా చక్రాంబుజా ద్యంకితా!
36
వ. అని వినుతించి, దేవా! నీ మాయం జేసి జగంబు భ్రాంతం బై యున్నయది. అది తెలియ
నానతీయవలయు. అని యడిగిన, నతండు నెఱింగించి చనియె. మునియును శివపూజ
సేయుచు, హరిస్మరణంబు సేయ మఱచి, శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే
ధరాతలంబు నింప జలమయం బై, యేకార్ణవం బై, యంధకార బంధురం బయిన, నంత
మార్కండేయుండు, నా తిమిరంబునం గానక భయపడి యున్నయెడ, నా జలమధ్యంబున నొక
వటపత్రంబునం బద్మరాగ కిరణపుంజంబుల రంజిల్లు పాదపద్మంబులు గల బాలునిం గని,
మ్రొక్కి, యతని శరీరంబు ప్రవేశించి, యనేకకాలం బనంతం బగు జఠరాంతరంబునం
దిరిగి, యతని చరణారవింద సంస్మరణంబునంజేసి వెలువడి, కౌఁగిలింపంబోయిన, మాయ
గైకొని, యంతర్ధానంబు నొంద, మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు చేరి, తపంబు
సేయుచున్న సమయంబున.
37
AndhraBharati AMdhra bhArati - itihAsamulu - bhAgavatamu - dvAdaSa skaMdhamu - bammera pOtana poetana pothana potanAmAtya pOtanAmAtyuDu ( telugu andhra )