కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
రసికావతంసుఁడగు శ్రీకృష్ణుని లాలనము
చ. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కఁ బూని తాఁ
చిన యది నాకు మన్ననయ ! చెల్వగు నీ పద పల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవు గదా యిఁకనైన నరాళ కుంతలా!
123
చ. అన విని మానినీ తిలక మప్పుడు మేయఱ తోఁప నిక్కి వీ
డిన కచ పంక్తి పల్మఱు ముడిన్వెడ ద్రోపుచు పై చెఱంగు గ్ర
క్కన చను దోయి చేర్చుచు మొగంబున లేఁజెమటంకురింప జం
కెన నెఱిఁ జూపు జూచి పలికెం జలితాధర పల్లవాగ్రయై
124
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )