కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
పారిజాత వృక్షమునే తెచ్చియిచ్చెదనని కృష్ణుని ప్రతిన
ఉ. ఓలలితేంద్రనీల శకలోపమ కైశిక! యింత వంత నీ
కేల లతాంతమాత్రమున కేఁ గలుగ న్విను; నీకు దేవతా
కేళి వనంబు సొచ్చి, యనికి న్బలసూదనుఁడెత్తి వచ్చినన్‌
డీలు పడంగఁ దోలి, యిటఁ దెచ్చెద నిచ్చెదఁ బారిజాతమున్‌
135
తే. వామలోచన నీ కేలి వనములోన
చలువ వెదజల్లు చెంగల్వ కొలని కెలన
సరస కర్పూర కదళికా తరుల నడుమ
పెరటి జెట్టుగ నాటింతు పెంపు గనుమ
136
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )