కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
పారిజాతాపహరణము - తృతీయాశ్వాసము
క. శ్రీమహితగేహ! యుత్కల
భూమీధవ దర్ప హరణ భుజసార! సుధా
ధామ కుల జలధి కౌస్తుభ!
రామా పాంచాల! కృష్ణరాయ నృపాలా!
1
తే. అవధరింపుము జనమేజయ క్షితీశ
వరున కిట్లను నమ్మౌనివల్లభుండు
గగనగంగా ప్రతీరోపకంఠభూమి
నల్లనల్లన నేతెంచు నవసరమున.
2
ఉ. అంతకుమున్న నారదమహామునిచే మఘవుండు కంసదై
త్యాంతకు రాక దా నెఱిఁగి యభ్రమువల్లభు నెక్కి సంభ్రమా
క్రాంత మనస్కుఁడై యెదురుగాఁ జనుదెంచె జయంతుఁడుం దిశా
కాంతులు మేనకాది గణికా నివహంబులు వెంటఁ గొల్వఁగ\న్‌.
3
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )