కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన తృతీయాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. అర్చిష్మ త్ప్రతిమ ప్రతాప! మహనీయ త్యాగ! దైత్యాభియా
త్యర్చోద్య చ్చతు రర్ణవాంత సకల జ్యాభోగ! జాగ్ర ద్యశ
శ్చర్చా సాంద్ర దిగంతరాళ! మదన శ్యామాసహా యేంద్రభూ
వర్చ స్స్తేన శరీర మోహిత జగ ద్వామా! కళా మానసా!
59
క. విదళిత కాళింగ మదా,
స్పద సింధుర కుంభరత్న శర్కరి లారా
దుదయగిరి కొండవీటీ,
పదవీస్థల మండలీక భాస్కరబిరుదా!
60
పంచచామరము. మరు ద్వృథా తటస్థ శత్రుమండలీ గళాంతర
క్షర న్నవాసృగాపగాభిసారికాదృతాంబుధీ!
మరుత్పతి స్వరు క్షతి క్రమ త్రుట త్కుభృద్వర
స్ఫుర ద్ధ్వనిప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటీ!
61
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార
సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక
గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన
పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ దృతీయాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )