కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
సత్యా శ్రీకృష్ణుల వనవిహారము
మ. అమరారాతి విఘాతి సత్యఁ గని కాంతా! చూచితే పారిజా
తము భూమీరుహ చక్రవర్తిఁ ద్రిజగ త్సంపూజ్య సౌరభ్యకీ
ర్తి మరుల్లోక మలంకరించునది గౌరీనాథు జూటస్థలం
బు మృగాంకుండు, రమామనోరమునురంబుం గౌస్తుభంబుంబలె\న్‌.
3
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )