కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన చతుర్థాశ్వాసము
ఉదయ సూర్య ప్రస్తుతి
సీ. మొగుడుఁ దమ్ములఁ జిక్కు మగతేఁటి యలుఁగులు - సడలిపోఁ జేయు విశల్యకరణి,
కాలవశంబునఁ గడచన్న వాసర - శ్రీఁ గ్రమ్మఱించు సంజీవకరణి,
రే యను వాలునఁ బాయలైన రథాంగ - తతుల హత్తించు సంధానకరణి,
తిమిరంబుచే సొంపు సమసిన దిశలకు - వన్నియ నొసఁగు సౌవర్ణకరణి,
 
తే. మించు బీరెండయగ్నిఁ బుట్టించు సరణి,
కలుష ఘోర పయోరాశిఁ గడపు తరణి,
తోఁచెఁ బ్రాచీ మహీధరోత్తుంగ సరణిఁ
బ్రాఁజదువు మానికంబుల బరణి, తరణి.
49
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )