కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
పారిజాతాపహరణము - పంచమాశ్వాసము
క. శ్రీ వర్ణనీయ! తిరుమల
దేవీహృదయేశ! యమృతదీధితి కుల పా
రావార పారిజాత! ధ
రావలయ శరణ్య! కృష్ణరాయ వరేణ్యా!
1
తే. అవధరింపుము జనమేజయ క్షితీశ
వరున కిట్లను నమ్మౌనివల్లభుండు
దైవ సైన్యంబు లీరీతిఁ దరతరంబ
వెడలి మొన లేర్పరించి యుద్వేలవృత్తి.
2
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )