కీర్తనలు శ్యామా శాస్త్రి కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే
పున్నాగవరాళి - ఆది
పల్లవి:
కనకశైల విహారిణి శ్రీ కామకోటిబాలే సుశీలే॥
అను పల్లవి:
వనజభవహరినుతే దేవి తుహినగిరిజే లలితే సతతం
వినతం మాం పరిపాలయ శంకర వనితే సతి మహాత్రిపుర సుందరి॥
చరణము(లు):
కంబుకంఠి కంజసదృశ వదనే కరిరాజగమనే మణిసదనే
శంబరవిదారి తోషిణి శివశంకరి సదా మధుర భాషిణి॥
చండ ముండఖండనపండితేక్షుదండ కోదండమండితపాణి
పుండరీక నయనార్చితపదే త్రిపురవాసిని శివే హర విలాసిని॥
శ్యామళాంబికే భవాబ్ధి తరణే శ్యామకృష్ణపరిపాలిని జనని
కామితార్థఫలదాయికే కామాక్షి సకలలోకసాక్షి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kanakashaila vihAriNi shrI kAmakOTibAlE sushIlE