కీర్తనలు శ్యామా శాస్త్రి సరి యెవరమ్మా అంబ నీ
భైరవి - ఖండ ఝంప
పల్లవి:
సరి యెవరమ్మా అంబ నీ
దయజూడవమ్మా శ్రీ కామాక్షి నీ॥
అను పల్లవి:
పరమపావనీ భవానీ దేవీ
పరాశక్తి నీవని నమ్మినాను॥
చరణము(లు):
మాధవసోదరీ గౌరీ అంబమహాభైరవీ శాంభవీ
నాద రూపిణీ జననీ దేవీ నారాయణీ నళినాక్షి॥
రాజరాజేశ్వరీ చిద్రూపీ రాజీవాక్షీ లోకసాక్షీ
తేజోమయీ జననీ దేవీ ఓజోవతీ ఓంకారీ॥
పామర పావనీ పార్వతీ దేవీ పాకారివినుతే శ్రీ లలితే
శ్యామకృష్ణ పరిపాలినీ దేవీ శ్యామగిరి సుపుత్రి॥
స్వరము(లు):
సారసదళనయనా హరిహరసురనుత లలితా నిను సతతము శరణము
కోరితిని కమల పాదయుగము నమ్మితి సుందరి శంకరి ఈ జగములో॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - sari yevarammA aMba nI