కీర్తనలు శ్యామా శాస్త్రి హిమాచలతనయ బ్రోచుటకిది
ఆనందభైరవి - చాపు/ఆది
పల్లవి:
హిమాచలతనయ బ్రోచుటకిది మంచి సమయము రావే అంబా॥
అను పల్లవి:
కుమార జనని సమానమెవరిల ను మానవతి శ్రీ బృహన్నాయకి॥
చరణము(లు):
సరోజముఖి బిరాన నీవు వరాలొసగుమని నేను వేడితి
పురారి హరి సురేంద్రనుత పురాణి పరాముఖమేలనే తల్లి॥
ఉమా హంస గమా తామసమా బ్రోవ దిక్కెవరు నిక్కముగ
ను మాకిపుడభిమానము చూపు భారమా వినుమా దయతోను॥
సదా నతవరదాయకి నిజదాసుడను శ్యామకృష్ణ సోదరి
గదా మొఱ వినవా దురితవిదారిణి శ్రీ బృహన్నాయకి॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - himAchalatanaya brOchuTakidi