కీర్తనలు శ్యామా శాస్త్రి హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే
కల్యాణి - రూపక
పల్లవి:
హిమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే॥
అను పల్లవి:
సుమేరుమధ్య వాసిని శ్రీ కామాక్షి॥
చరణము(లు):
హేమగాత్రి పంకజనేత్రి మతంగాత్మజే
సరోజభవ హరీశ సుర మునీంద్రనుతే॥
అంబుజారి నిభవదనే మౌక్తికమణి
హారశోభమాన గళే భక్త కల్ప లతే॥
శ్యామకృష్ణ సోదరి గౌరి పరమేశ్వరి గిరి
జాల నీలవేణి కీరవాణి శ్రీ లలితే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - himAdrisutE pAhimAM varadE paradEvatE