కీర్తనలు శ్యామా శాస్త్రి ఏమని మిగుల వర్ణింతు ఈ మహిని నే నీ మహిమలు
తోడి - ఆది
పల్లవి:
ఏమని మిగుల వర్ణింతు ఈ మహిని నే నీ మహిమలు॥
అను పల్లవి:
సామజగమనా ధర్మసంవర్ద్ధనీ అంబా సురులకు
నీ మాయ తెలియలేరు శాంభవీ నీమహాత్మ్యమతిశయము॥
చరణము(లు):
నీరజలోచనా లోకములో నిను హృదయములో
నిలుపిన లోకులు ధన్యులైరిగా నలుగురిలో
సారమతీ నను దయతో గాంచి కరుణించుము తల్లి నెఱ నమ్మితి
చాలా మహాలీల గలిగిన శక్తి సంతతము నీవే సంతోష వతి॥
ఓ జనని కరుణి భవప్రియా వినుమవని
ఓమ్‌ అనిన జన్మసాఫల్యమాయే నీదు కథలను విని
ఓ మోహావృతలైయున్న జనులను తల్లి ఇపుడు బ్రోవుము
ఓ రాజాధిరాజేంద్రమణి మకుట పటలి మణి విరచితపదా॥
కంజనదాంతుని కామితాశుభచరితా ప్రసన్నవదనా
ఘన కృపాసహితా శ్యామకృష్ణ చింతా గిరితనయా
పంచనద కావేరి తీరమున నివసించే ఉమా
పంచాపకేశముని నుతా హైమవతీ పరాశక్తీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - Emani migula varNiMtu I mahini nE nI mahimalu