కీర్తనలు శ్యామా శాస్త్రి సారసాక్షి సదా (గీతమ్‌)
సావేరి - త్రిపుట
1: సారసాక్షి సదా పాహిమామ్‌ కుమారజనని సరస హృదయే
పరాశక్తి బాలే సుశీలే అపార మహిమా స్ఫూర్తే శివే॥
2: కోటిసూర్యప్రభే కోమళే త్రికోణ నిలయే కనకసదృశే
కటిధృత కాంచే సలిలే ప్రకాశ సుగుణ కీర్తే ఉమే॥
3: శ్యామకృష్ణనుతే శ్యామళే శ్రీ కామకోటి పీఠసదనే
సామగానలోలే సుశోభే విశాలహృదయమూర్తే శుభే॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - sArasAkShi sadA (gItam)