కీర్తనలు శ్యామా శాస్త్రి పార్వతి జనని శ్రీ రాజరాజేశ్వరి(గీతమ్‌)
భైరవి - ఖండ మఠ్యమ్‌
1: పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి సర్వలోకపాలిని మానిని దేవి
నీరజాక్షి పరమపావని కామాక్షి నిరంజని మామవ అంబా॥
2: శ్రీకరి జనని మృడాని శ్రీ రాజరాజేశ్వరి హ్రీంకారరూపిణి హరిణాక్షి దేవి
శ్రీ కాంచీపురవాసిని కామాక్షి శ్రీ కామేశ్వరి మామవ అంబా॥
3: శాంభవి జనని పురాణి శ్రీ రాజరాజేశ్వరి శర్వరీశ ధారిణి శంకరి దేవి
శ్యామకృష్ణ పరిపాలిని కామాక్షి శ్యామళాంబికే మామవ అంబా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pArvati janani shrI rAjarAjEshvari(gItam)