కీర్తనలు శ్యామా శాస్త్రి పాలయాశు మాం పరదేవతే
ఆరభి - త్రిపుట
పల్లవి:
పాలయాశు మాం పరదేవతే॥
అను పల్లవి:
కాలకాలవల్లభే లలితే అతిలలితే॥
చరణము(లు):
గానవినోదినీ నిరంజనీ దానప్రదాయినీ రంజనీ
మానోన్నతిం దేహి మే శివే మానవతీ హిమగిరితనయే॥
కంజలోచనే కామాక్షీపంచాక్షర వైభవ ముదితే
కామకోటిపీఠ సువాసిని శ్యామకృష్ణ పరిపాలిత జననీ॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - pAlayAshu mAM paradEvatE