కీర్తనలు శ్యామా శాస్త్రి కామాక్షి నాతో వాదా దయలేదా
బేగడ - ఆది
పల్లవి:
కామాక్షి నాతో వాదా దయలేదా
కమలాక్షీ నన్నొకని బ్రోచుట భారమా బంగారు॥
అను పల్లవి:
తామసము జేసితే నే తాళనమ్మా నీ
నామపారాయణము విన వేడితినమ్మా మాయమ్మా॥
చరణము(లు):
శ్యామకృష్ణసోదరీ తల్లీ అంబా శుక
శ్యామళే నిన్నే కోరియున్నానమ్మా మాయమ్మయని నే దలచి దలచి
మాటి మాటికి కన్నీరు విడువలేదా అంబా నీవు మాటాడకుండిన నే తాళలేనమ్మా
నీ బిడ్డను లాలించవే దొడ్డ తల్లివే కామాతుల చపలచిత్తపామరుడై
తిరిగి తిరిగి ఇలలో కామిత కథలు విని విని వేసారి నేను ఏమారిపోదునా॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - kAmAkShi nAtO vAdA dayalEdA