శృంగార సంకీర్తన
రేకు: 1182-3
సంపుటము: 21-423
రేకు: 1182-3
సంపుటము: 21-423
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఇంటికి వచ్చినవాఁడ వీడేర్చుకోవయ్య జంట గూడినవాఁడవు చనవియ్యవయ్యా | ॥పల్లవి॥ |
తరుణి వలచినదే తప్పయితేఁగనక వురవుగా నీవది వోర్చుకోవయ్యా మరలి నిన్నుఁ జూచుటే మచ్చరమైతేఁగనక నిరతితో నందుకొను నీకు మొక్కేనయ్యా | ॥ఇంటి॥ |
వెలఁది మాటాడినదే వెంగెములై తేఁగనక మలసి యీనేరమి మన్నించవయ్యా అలమిపట్టినదే అపరాధమైతేఁ గన బలిమిచెల్లఁగ నీకుఁ బంతమిచ్చీనయ్యా | ॥ఇంటి॥ |
ఇంతి పాదాలొత్తి నదే యెగ్గులైతేఁ గనక చెంతనే నేరు పాపెకుఁ జెప్పవయ్యా కాంతను శ్రీవేంకటేశ కలిసితి వింతలోనె వింతవింతరతులను వియ్యమందవయ్యా | ॥ఇంటి॥ |