Display:
శృంగార సంకీర్తన
రేకు: 1182-5
సంపుటము: 21-425
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఆనతిమ్మా వినేఁగాని అది గొంత
యీ నెలఁత నీపై బత్తి యిటువంటిదా
॥పల్లవి॥
వద్దనే నుండఁగానె వనిత సన్నలు సేసీ
కద్దా తొల్లిఁ బొందు కాంతకు నీకు
ముద్దుముద్దువలెనే మోము చూచి నవ్వీని
యిద్దరికి లోలోనే యింతవలపా
॥ఆన॥
కమ్మటినిఁ గానకుండా కానికలంపీ నీకు
సమ్మతా నీ కాపెసేసేసరితలెల్లా
పమ్మి నీవు విందువంటా పాటపాడీ నాడనుండే
వుమ్మడి మీతమకపుటొద్దిక లింతేశా
॥ఆన ॥
నీవూ నేనూఁ జూడఁగానే నిలుచున్న దీడ వచ్చి
కావర మింతేసి మీకుఁ గప్పివున్నదా
శ్రీవేంకటేశ యిద్దరిఁ జేతులు వట్టి కూడితి-
వీవేళనే నీయాపెయెన్నికలుఁ గూడెనా
॥ఆన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము