శృంగార సంకీర్తన
రేకు: 1225-3
సంపుటము: 22-147
రేకు: 1225-3
సంపుటము: 22-147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఆతనికి నీకు నింపులై యుండఁగా యీతలాతలివారి కెంచఁగనేమిటికి | ॥పల్లవి॥ |
మగఁడుమన్నించేదానిమాటలెల్లాఁ జక్కనే తగవరివనితపంతము చక్కన నగనేరిచినదానినటనలెల్లా జక్కన యెగసకెములాడఁగ యెవ్వరికేమిటికి | ॥ఆత॥ |
సిరిగలిగినదానిచేఁతలెల్లాఁ జక్కనే పొరుగుపోరచికాంతపొందు చక్కన సరినిచ్చకపుదానిసరసములు చక్కన దొరకొని యెవ్వరికి దూరఁగనేమిటికే | ॥ఆత॥ |
పాయము గలుగు దాని పగటులెల్లాఁ జక్కనే చాయయెఱిఁగినసతిజాడ చక్కన యీయెడ శ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను పాయక నన్నేలె తాము పచ్చార నేమిటికే | ॥ఆత॥ |