Display:
శృంగార సంకీర్తన
రేకు: 1225-4
సంపుటము: 22-148
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
పడఁతి నీవుసేసినభాగ్య మెట్టిదో
అడరి నీపై నిలిచె నాతనిమోహము
॥పల్లవి॥
చాలుకొన నిన్నుఁజూచి సారెసారె నాతఁడు
కెలెత్తి మొక్కఁగదవే కిమ్ములనుండి
అలకించి నీసుద్దులే యంగనలతోఁ జెప్పీని
వేళగాచుక వుండుమీ వేడుకతోను
॥పడ॥
కొచ్చికొచ్చి సన్న సేసీ కోరికోరి నీకతఁడు
వచ్చేనని చెప్పెంపవే వనిత నీవు
మచ్చికతోఁ దలపోసీ మతిలోనే నీరూపు
యిచ్చోటు వదలకుమీ యీడకే వచ్చీవి
॥పడ॥
నెలవుల నవ్వీ నిన్ను శ్రీవేంకటేశ్వరుఁడు
అలమేల్‌మంగవు విడె మటు చూపవే
తలఁపెఱిఁగి మన్నించి తానే వచ్చి నిన్నుఁ గూడె
నెలకొని యిచ్చకమే నించుమీ యీతనికి
॥పడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము