శృంగార సంకీర్తన
రేకు: 1231-6
సంపుటము: 22-186
రేకు: 1231-6
సంపుటము: 22-186
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంక నీచిత్తమేకాని యీపె కడ మేమి లేదు అంకెల నీకె గుణమే లరసేవు నీవు | ॥పల్లవి॥ |
పవళించి వుండితే నీపాదా లోత్తనేరుచు ఇవలఁ గూచుండి విడెమియ్యనేరుచు నవకమై లాలించితే నవ్వులు నవ్వనేరుచు నివిరి ఇంకా నేమైనా నేరువు మీకెకును | ॥ఇంక॥ |
మచ్చిక నీవుసేసితే మాటాలాడనేరుచు ఇచ్చగించితే వీణె వాయించనేరుచు పచ్చిగా మన్నించితే పక్కనుండనేరుచు నిచ్చనిచ్చ యేమైనా నేరువు మీకెకును | ॥ఇంక॥ |
కానిమ్మనివుంటే మతి గరఁగించనేరుచు మేనంటినీవు గూడితే మెచ్చనేరుచు యే నలమేలుమంగను నన్నేలితి శ్రీవేంకటేశ నీనేరుపు లేమైనా నేరుపు మీకెకును | ॥ఇంక॥ |