శృంగార సంకీర్తన
రేకు: 1268-2
సంపుటము: 22-404
రేకు: 1268-2
సంపుటము: 22-404
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
మూరెఁడు గొప్పుతోడి ముద్దరాలికి చీరుమూరాడీ వలపు చిత్తగించవయ్యా | ॥పల్లవి॥ |
కంచపుమోవి చూపి కాఁగిలించుమని నీకు లంచమిచ్చీ నదివొ లలితాంగి కొంచక పయ్మదలోని గుబ్బలు గానుకవట్టి వంచనతో మొక్కీ నాకెవంక చూడవయ్యా | ॥మూరె॥ |
చిక్కగా నవ్వులునవ్వి సిగ్గులువడుకొంటాను చక్కెరమాఁట లాడీ జవరాలు తక్కక కొలువు సేసి దండనుండి తమిరేఁచి చెక్కునొక్కి వేఁడుకొనీ సేసవెట్టవయ్యా | ॥మూరె॥ |
చల్లనిచూపులఁ జూచి సన్నలనే రతులకు మెల్లనే పిలిచీ నలమేలుమంగ యిల్లిదె శ్రీవేంకటేశ యింతలో నీవు గూడఁగా చల్లీ నీపై సరసము చనవియ్యవయ్యా | ॥మూరె॥ |