శృంగార సంకీర్తన
రేకు: 1320-5
సంపుటము: 23-119
రేకు: 1320-5
సంపుటము: 23-119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
కడమలే దేమిటాను ఘనుఁడవయ్యా కడుపులోనే నేర్పితి కంటిమయ్యా | ॥పల్లవి॥ |
సిగ్గువడ్డఆపెనే చీరవట్టి తీసేవు అగ్గలమైతి వన్నిటా నౌనయ్యా వొగ్గి నవ్వేయాపెనే వూరకే గిలిగించేవు తగ్గులేనిజాణఁడవు తగునయ్యా | ॥కడ॥ |
మొక్కేటియా సెపైనే మోపేపు నీపాదములు మిక్కిలి నేరుపరవి మేలయ్యా అక్కరపడేయాపెకే ఆసలు మరి రేఁచేవు యెక్కువగుణాలు నీయం దెఱిఁగితిమయ్యా | ॥కడ॥ |
కూడేటియాపెనే కుచ్చి కాఁగిలించేవు వోడనేమిటికి నీవు వొప్పితిమయ్య పాడితో శ్రీవేంకటేశ పైకొని యాపెఁ బైకొంటి వేడనైనా నీవే దొర నియ్యకొంటిమయ్యా | ॥కడ॥ |