శృంగార సంకీర్తన
రేకు: 1320-6
సంపుటము: 23-120
రేకు: 1320-6
సంపుటము: 23-120
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తెలుఁగుఁగాంబోది
వట్టి బూటకాన వడి నన్ను దూరేవు దట్టించి ముట్టితే తాఁకీనటరా | ॥పల్లవి॥ |
కొప్పువట్టితీసి గోర గీరితే యిప్పుడింతలోనే యేమాయరా వుప్పతించి నిన్ను నొట్టువెట్టితే కప్పిననీమేను కనుగందెనటరా | ॥వట్టి॥ |
తిలకించి చూచి తిట్టుదిట్టితే యెలమి నింతలో నేమాయరా లలి సరసాన లావు చూపితే అలసి నీ వుర మగడాయనటరా | ॥వట్టి॥ |
సారె గాఁగిలించి చన్నుల నొత్తితే యేరా యింతలోనే యేమాయరా యీరీతి శ్రీవేంకటేశ నేఁ గూడితే బీరపునీమోవి పిప్పాయనటరా | ॥వట్టి॥ |