Display:
శృంగార సంకీర్తన
రేకు: 1363-3
సంపుటము: 23-375
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్రం
ఇదివో మంచివేళ యిఁకనెన్నఁడు
యెదుటనే మరుని జయించవచ్చు నిప్పుడు
॥పల్లవి॥
కాంతనిలువెల్లా నీకు కనకపురథము
బంతినున్న పిఱుఁదులే బండికండ్లు
పొంతనున్న కుచములే పూవులగుత్తులు నీకు
ఇంతటను మరుని జయించవచ్చు నిపుడు
॥ఇది॥
వెలఁదిపయ్యదకొంగు విజయధ్వజము నీకు
చెలువబొమ్మలే సింగిణివిండ్లు
అలరినచూపులే అక్షయబాణములు
యెలమి మరుని జయించవచ్చు నిపుడు
॥ఇది॥
అలమేల్మంగకాఁగిటి హస్తములే పగ్గాలు
చెలిఁగినపెనుఁగొప్పే శిఖరము
నెలవై శ్రీవేంకటేశ నీవే రథికుఁడవు
యిలలోన మరుని జయించవచ్చు నిపుడు
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము