శృంగార సంకీర్తన
రేకు: 1365-4
సంపుటము: 23-388
రేకు: 1365-4
సంపుటము: 23-388
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఆనతియ్యఁగదవే అదియు మా సంతోసమే పూచిన సిగ్గుల నింత పొరలఁగ నేఁటికే | ॥పల్లవి॥ |
చెలరేఁగిచెలరేఁగి చెలులతో మాటాడేవు మలసియాతఁడు నిన్ను మన్నించెనటే సెలవులనే నవ్వులుచిమ్మిరేఁగి వున్నవి అలమి అన్నిటా నిన్ను నాదరించెనా | ॥ఆన॥ |
భావించిభావించి యట్టె పాటలెల్లాఁ బాడేవు సేవలకు మెచ్చాతఁడు చెక్కు నొక్కెనా కావిరి వేడుకలనుఁ గడునుబ్బీ నీమేను మోవియిచ్చి యాతఁడు నీమోహము చేకొనెనా | ॥ఆన॥ |
చొక్కిచొక్కి తమకాన సొరిదిఁ బులకించేవు యెక్కువ శ్రీవేంకటేశుఁడిట్టె కూడెనా పుక్కిటివిడెముతోడఁ బొదలుచు మురిసేవు చక్కనియీతఁ డింతేసి చన విచ్చెనా | ॥ఆన॥ |