శృంగార సంకీర్తన
రేకు: 1402-1
సంపుటము: 24-7
రేకు: 1402-1
సంపుటము: 24-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
అన్నియు నీయందే అమరెనట కన్నియ ఇందుకు మారుగత చెప్పవే | ॥పల్లవి॥ |
కలువలు వికసింపఁ గమలములై తోఁచె గలికి విన్నిట నీకత చెప్పవే అలులంటా బడిఁబోతే అన్నయు నీలములాయ కలగాదు ఇది యొక్కకత చెప్పవే | ॥అన్ని॥ |
జక్కవలు గండుమీది సరిఁ బైడికుండలాయ గక్కన విచారించి కత చెప్పవే మక్కువతో బులినాలు మదనచక్రములాయ కక్కసము మాని నాకీకత చెప్పవే | ॥అన్ని॥ |
ఆకసము చూడజూడ నదె సింహమాయ నట కాకుగాదు ది యొక్కకత చెప్పవే యీకడను శ్రీవేంకటేశుఁడను నే నిన్ను పై కొన్న దిది యొక్కకత చెప్పవే | ॥అన్ని॥ |