శృంగార సంకీర్తన
రేకు: 1406-1
సంపుటము: 24-31
రేకు: 1406-1
సంపుటము: 24-31
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఒక్కటికి నురిగట్టే వొంటికి దాయిగట్టే- వెక్కువ గోవాళవిద్య లీడఁ జేయవలెనా | ॥పల్లవి॥ |
నిక్కినిక్కి యాకెఁ జూడ నిడివి యాడకు నీడ అక్కడికే పోరాదా అంతగలితే మొక్కిమొక్కి నన్నుజూఁచి మూఁగసన్నలేలసేయ ఇక్కడికే రారాదా యింతగలితేను | ॥ఒక్క॥ |
చెప్పిచెప్పి పంపనేల సెలవుల నవ్వనేల అప్పటి నీ వేఁగరాదా అంతగలితే తిప్పితిప్పి నాతోనుఁదెగి జాణతనమేల యిప్పుడే మన్నించరాదా యింత గలితేను | ॥ఒక్క॥ |
పూచిఁపూచిఁ మాని నాతో బూమెలు సేసేవుగాక ఆచాయ నుండవా నీ వంతగలితే చేచేతఁ గూడితివి శ్రీవేంకటేశ నన్ను యీ చలమే నీకు దక్కె నింత గలితేను | ॥ఒక్క॥ |