శృంగార సంకీర్తన
రేకు: 1409-3
సంపుటము: 24-51
రేకు: 1409-3
సంపుటము: 24-51
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంతలోననే యివి రెండూ చింతలు దమకములు చెలువుఁడ నేఁడు | ॥పల్లవి॥ |
చెనకుల నీకడ చెనకులు వింటేఁ దునియనిచిత్తముఁ దుత్తుమురౌ మునుకొని యిప్పటిమోహము చూచిన అసలుఁగొనలునై యాసలు వొదలు | ॥ఇంత॥ |
ఇంచుకవడి నీ విటురాకుండిన కంచుఁబెంచు నౌఁ గాయమిది అంచెలఁ గన్నుల నటు నిన్నుఁ గంటే పొంచినముదములఁ బులకలు మొలచు | ॥ఇంత॥ |
కదియుచు నీ వాకడిమోమైతే చెదరి కోరికలు చిందరలౌ యిదె నన్ను శ్రీవేంకటేశ్వర యిటువలె పొదిగినమోములఁ బొత్తులు గలయు | ॥ఇంత॥ |