Display:
శృంగార సంకీర్తన
రేకు: 1497-5
సంపుటము: 24-581
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎంత నిన్ను నెలయించీ నిదివో చెలి
కాంతుఁడవు నిన్నింత కరఁగించె నీచెలి
॥పల్లవి॥
పక్కన నవ్వుతానే పంతములాడీఁ జెలి
చెక్కు నొక్కాతానే గోరఁ జెనకీఁ జెలి
చక్కఁగాఁ దప్పకచూచి సారెకు జంకించీఁ జెలి
మొక్కుతానే చన్నులమొనలు చూపీఁ జెలి
॥ఎంత॥
సంగడిఁ గూచుండుతానే చలము సాదించీఁ జెలి
జంగిలిమాటలాడి జరసీఁ జెలి
చెంగలించి మోవి యాని చిన్నలు నించీఁ జెలి
సింగారించేయందులోనే చిమ్మిరేఁగించీఁ జెలి
॥ఎంత॥
పాటలు నీపైఁ బాడి బయలీఁదించీఁ జెలి
చీటికిమాటికి రతిసేసీఁ జెలి
నీటున శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
కోటిసేయ ని న్నప్పటిఁ గొసరీఁ జెలి
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము