Display:
శృంగార సంకీర్తన
రేకు: 1544-1
సంపుటము: 25-199
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కన్నె ముద్దరాలు నీతో గట్టివాయితనముదా
సన్నల చాయలనేచలపాదిఁ జేతురా
॥పల్లవి॥
సిగ్గుపడి లోలోనే శిరసు వంచుకోఁగానే
వెగ్గళించి చెలినేల వేఁడుకోనేవు
వొగ్గుచుఁ జేతుల సారె నొడ్డుకొంటాఁ దిట్టఁగానే
బగ్గనఁబోఁకముడివట్టి విడిచేవు
॥కన్నె॥
మొక్కుచుఁ బయ్యదకొంగు ముసుఁగువెట్టుకోఁగానే
గుక్కకచన్నులమీదగోర గీరేవు
పక్కన నీదువురము పాదమునఁ జిమ్మఁగానే
అక్కున నదిమి సతిఅయా అంటేవు
॥కన్నె॥
అద్దలించిజంకించి అనలెల్లాఁ బెట్టఁగాను
వుద్దండాన మోవిఁగెంపు లొనరించేవు
సుద్దుల శ్రీవేంకటేశ సుదతిఁ గూడితి నిట్టె
కొద్దిమీరఁగూడినానుకోరికఁ దనియవు
॥కన్నె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము