శృంగార సంకీర్తన
రేకు: 1546-4
సంపుటము: 25-214
రేకు: 1546-4
సంపుటము: 25-214
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంతినేల నేరాలెంచేవు నీవు జంతలవలెనే నీతో సరసములాడునా | ॥పల్లవి॥ |
పిలిచి నిన్నోకమాఁటు పేరుకొంట చాలదా పలుమారు నుతించునా బట్టువలెను నెలకొని నీవద్దనిలుచుంట చాలదా బలిమిఁ బై పడునా వసురమువలెను | ॥ఇంతి॥ |
మొక్కె నీకుఁ జేతులెత్తి మొదలనే చాలదా దిక్కనఁ బాదాలంటునాఁ దీగెవలెను గక్కున నిన్నుఁ గన్నులఁ గనుఁగొంట చాలదా మిక్కుటమై చూచునా మించ లేడు(డి?) వలెను | ॥ఇంతి॥ |
ఇట్టె కాఁగిలించి నిన్ను నెనయుట చాలదా పట్టి కడు నురుపునా బంతివలెను గుట్టున శ్రీవేంకటేశ కొంత నవ్వెఁ జాలదా తొట్టి సకిళించునా తురగమువలెను | ॥ఇంతి॥ |