Display:
శృంగార సంకీర్తన
రేకు: 1596-6
సంపుటము: 25-456
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పూర్వగౌళ
ఇద్దరి తమకములు ఇటు నీకే తెలుసును
సుద్దులు చెప్పఁగ మరి చోటున్న దా
॥పల్లవి॥
చెక్కు చేతఁబట్టుకొని చిరునవ్వు లేఁటికే
మక్కువ నీవల్లనే మోమాఁట దోఁచీని
అక్కడ నాతఁడు నీతో నాడేమాటఁలకు
యిక్కడ నావునికి యిటు సరివచ్చెనా
॥ఇద్ద॥
యెదురుగా వచ్చివచ్చి మేమి తప్పక చూచేవే
అదన నీవల్లఁ బనులన్నీ నున్నవి
చెదర కాతఁడు దలఁచేటితలపులకును
మదిలో నామర్మానకు మరి సరివచ్చెనా
॥ఇద్ద॥
మిక్కిలి వేడుకతోడ మెచ్చు లేమి మెచ్చేవే
తక్కక నీవల్ల మేలు దయిలువారీని
యిక్కువఁ గూడె శ్రీవేంకటేశుడలమేల్మంగ నే
నిక్కడా నక్కడా నన్ని నిటు సరివచ్చెనా
॥ఇద్ద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము