శృంగార సంకీర్తన
రేకు: 1601-1
సంపుటము: 26-1
రేకు: 1601-1
సంపుటము: 26-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
పంతగాఁ డప్పటి నన్నుఁ బైకొననేలే పొంత చెమటలలోనె పుంగుడయ్యేఁగాక | ॥పల్లవి॥ |
మక్కువలేనివిభుఁడు మాటలాడఁ బనియేమే వొక్కమనసునఁ దానే వుండుగాక చిక్కని నవ్వులతోనే సెలవి గొణఁగనేలే వుక్కవలపుల నేనే వుమ్మగిలేఁ గాక | ॥పంత॥ |
మనసురానిపతి మముఁ దిట్టఁబనియేమే తనరాజసముతోనే దైవారుఁగాక కనుచూపుఁగోపముతో కాఁకపులకలతోనే తనరూపు దలపోసి తమకించేఁగాక | ॥పంత॥ |
అలిగినరమణుఁడు ఆసపడి కూడనేలే పిలిచినదాఁకా నుండి పెనఁగుఁగాక చెలఁగి వేడుకతోడ శ్రీ వేంకటేశుఁడు దానె కలఁడు నాకు గతెని కళదేరేఁగాక | ॥పంత॥ |